బ్యాంకులో ఖాతా ఉన్న వ్యక్తి లోన్ తీసుకున్న అనంతరం ఆకస్మాత్తుగా చనిపోతే ఆ అప్పు అలాగే మిగిలిపోతుంది. అయితే ఆరుణం ఎవరు కట్టాలి? రుణ గ్రహీత వారసులు కట్టాలా? లేక నామినీదారులు కట్టాలా ? అనే డౌట్స్ చాలా మందికి కలగొచ్చు. లోన్ తీసుకున్న వ్యక్తి మరణించిన తర్వాత లోన్ తిరిగి చెల్లించడానికి ప్రతి రుణానికి ఒక భిన్నమైన నియమం ఉన్నది. హోం లోన్ నిబంధనలు భిన్నంగా ఉంటాయి. అలాగే వ్యక్తిగత లోన్ రూల్స్ కూడా భిన్నంగా ఉంటాయి. అయితే ఒక్కో లోన్ విషయంలో నియమనిబంధనలు ఒక్కోలా ఉంటాయి.
హోం లోన్
హోం లోన్ తీసుకున్నప్పుడల్లా.. ఇంటి పేపర్లు లోన్ కు బదులుగా తాకట్టు పెడతారు. హోం లోన్ విషయంలో రుణగ్రహీత చనిపోయినప్పుడు, సహ రుణ గ్రహీత బాధ్యత వహించాల్సి ఉంటుంది. లేకపోతే ఆ వ్యక్తి వారసుడు ఆ రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. వారు లోన్ చెల్లించగలిగితే వారికి మాత్రమే బాధ్యత ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా.. ఆస్తిని తాకట్టు పెట్టడానికి, లోన్ తీర్చడానికి అవకాశం ఇస్తారు. ఇవేకాకుండా.. బ్యాంక్ రుణానికి ఉంచిన ఆస్తిని వేలం వేస్తారు. ఇలా చేయడం ద్వారా వచ్చిన డబ్బుని బ్యాంకు లోన్ అప్పుగా తీసుకుంటుంది. వాస్తవానికి బ్యాంకు నుంచి రుణం తీసుకునే సమయంలో బీమా ఉంటుంది. వ్యక్తి మరణిస్తే బీమా ద్వారా బ్యాంక్ దాన్ని తిరిగి పొందుతుంది. కాబట్టి లోన్ తీసుకున్నప్పుడల్లా బీమా గురించి బ్యాంకువారిని అడగాలి.
పర్సనల్ లోన్
పర్సనల్ లోన్ అంతగా మంచిది కాదు. అందుకే వ్యక్తిగత లోన్, క్రెడిట్ కార్డ్ లోన్ విషయంలో మరణించిన తర్వాత బ్యాంకులు మరే వ్యక్తి నుంచి డబ్బును తిరిగి పొందలేరు. అలాగే వ్యక్తిగత రుణానికి సంబంధించి వారసుడికి ఎటువంటి బాధ్యత ఉండదు. అటువంటి పరిస్థితిలో వ్యక్తి మరణంతో లోన్ కూడా ముగుస్తుంది.
వెహికిల్ లోన్
వెహికిల్ లోన్ అనేది ఓ రకమైన రుణం. లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే, బ్యాంకు గృహస్థులను రుణం చెల్లించమని అడుగుతుంది. అతను రుణం చెల్లించకపోతే, బ్యాంకులు వాహనాన్ని విక్రయించి రుణ మొత్తాన్ని తిరిగి పొందుతాయి.