Breaking News

5 మిలియన్స్ క్లబ్‌లో ఎన్టీఆర్

0 0

టాలీవుడ్ స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ తర్వాత ఎన్టీఆర్‌కు ఉన్న మాస్ ఫాలోయింగ్ ఏ హీరోకూ లేదు. ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుందంటే బాక్సాఫీస్ వద్ద ఉండే సందడి అంతా ఇంతా కాదు. అంతగా అభిమానులను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. తాజాగా ఆయన సోషల్ మీడియాలో మరో మైలు స్టోన్‌ను చేరుకున్నారు.

మే 28న నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా… ఒక్కరోజే ఈయనను దాదాపు 2 వేల మంది ఫాలో అవడం ఆసక్తికరంగా మారింది. దీంతో ట్విట్టర్ ఖాతాలో ఎన్టీఆర్ అభిమానుల సంఖ్య 5 మిలియన్లకు చేరుకుంది. ఈ క్రమంలో 50 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న అతి కొద్ది మంది టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకడిగా తారక్ నిలిచాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో #5MFollowersForNTR అనే హ్యాష్ ట్యాగ్‌ను అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్న ఎన్టీఆర్.. ఆ తర్వాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించబోతున్నాడు.