Breaking News

ఈ వారం టీఆర్పీ రేటింగ్స్

0 0

టెలివిజన్ కార్యక్రమాలకు ప్రాణం టీఆర్పీ రేటింగ్స్. వారం వారం విడుదలయ్యే టీఆర్పీ రేటింగుల వల్ల పలు టీవీల ర్యాంకులు మారిపోతుంటాయి. ఈ వారం (మే 8-మే 14) టీఆర్పీ రేటింగులను ఇప్పుడు చూద్దాం.

అటు కార్యక్రమాల విషయానికి వస్తే మాటీవీలో ప్రసారం అవుతున్న ‘కార్తీక దీపం’ సీరియల్ ఈ వారం కూడా టాప్‌లోనే కొనసాగుతోంది. రెండో స్థానానికే ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ పరిమితమైంది. ఈ వారం టాప్-5లోకి జీ తెలుగు ఛానల్‌కు చెందిన త్రినయని సీరియల్ రావడం విశేషం. మాటీవీ కొత్త సీరియళ్లు ‘గుప్పెడంత మనసు’, ‘జానకి కలగనలేదు’ వరుసగా 3, 4 స్థానాలను ఆక్రమించగా.. జీ తెలుగు సీరియల్ త్రినయని 5వ స్థానంలో నిలిచింది. గత వారం 5వ స్థానంలో నిలిచిన మాటీవీ ‘దేవత’ సీరియల్ ఈ వారం టాప్‌-5 నుంచి బయటకు వెళ్లిపోయింది.