Breaking News

RRR ఆలిండియా రికార్డు.. భారీ ధరకు శాటిలైట్, డిజిటల్ రైట్స్

2 0

మెగా పవర్​స్టార్ రామ్​చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా ప్రారంభం నుంచి ఈ సినిమా మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఆ స్థాయిలోనే ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్లకు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

గతంలో పెన్ స్టూడియోస్ సంస్థ భారీ ధరకు RRR శాటిలైట్, డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ‘జీ’ సంస్థ రూ.325 కోట్లకు RRR శాటిలైట్, డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ కొనుగోలు చేసిన నాన్ థియేట్రికల్ హక్కులను జీ సంస్థకు ట్రాన్స్‌ఫర్ చేశారని తెలుస్తోంది. ఇండియన్ సినిమాకు సంబంధించి ఈ డీల్ అతి పెద్దదని సమాచారం. గతంలో రెండు భాగాలుగా విడుదలైన ‘బాహుబలి’ మూవీ కూడా ఈ స్థాయిలో శాటిలైట్, డిజిటల్ రైట్స్ సంపాదించలేదు. కాగా తాజా సమాచారంతో
RRR మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్, జీ తెలుగు ఛానల్‌లో ప్రసారం కానుంది. అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల చేస్తామని గురువారం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

https://twitter.com/OTTGURUJINITHIN/status/1395726705063383049