తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కలిసి ఢిల్లీ పీఠంపై గురిపెట్టినట్లు హస్తిన వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇటీవల తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ రాజకీయ సలహాదారుడిగా రాబోతున్నట్లు వచ్చిన సమాచారం ఈ వార్తకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇప్పటికే ఏపీలో వైసీపీకి ప్రశాంత్ కిషోర్ వెన్నుదన్నుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీకి, మోదీకి ప్రస్తుతం అనుకూలంగా ఉన్నట్టే నటిస్తూ ప్రాంతీయ పార్టీలను కలుపుకుని ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్‌లో ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోవాలన్నది వీరిద్దరి ప్లాన్‌గా కనిపిస్తోంది. దీనికి అయ్యే ఖర్చు ఇప్పటిదాకా ఏపీలో, తెలంగాణలో ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్లు, వ్యాపారులు భరించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
బీజేపీకి అనుకూలమని బహిరంగంగా చెబుతూనే.. వెనుక నుంచి ప్రాంతీయ పార్టీలైన డీఎంకే, టీఎంసీ, జేడీఎస్, బీజేడీ, జేడీయూ, శివసేనలను కలుపుకుని ఢిల్లీ గెలవాలన్నది వీరి ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. పదేళ్ల పాలనలో మోదీపై పెరిగే అసంతృప్తి పెట్టుబడిగా.. ప్రాంతీయ పార్టీల బలం, మైనారిటీ ఓటు సహకారంతో ఢిల్లీ గద్దెనెక్కాలని ప్లాన్. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ఢిల్లీ ఆక్రమణ పథకాన్ని రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్లాన్ సక్సెస్ అయితే కేసీఆర్ ప్రధాని, జగన్ ఉప ప్రధాని కావడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.