Breaking News

ఏపీలో రేపటి నుంచి ఈ-పాస్ విధానం అమలు

1 0

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూను మరింత కఠినంగా అధికారులు అమలు చేయనున్నారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు జప్తు చేస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. అటు అంతర్‌రాష్ట్ర రాకపోకలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునేవరకు షరతులు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ-పాస్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 10 నుంచి ఈ-పాస్ విధానం అమలు చేస్తామని, అత్యవసర ప్రయాణికుల కోసం ఈ విధానాన్ని ప్రవేశపెట్టామని వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు వెల్లడించేవరకు రాష్ట్రంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.

ఏపీలో రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమతి లేదని డీజీపీ సవాంగ్ పేర్కొన్నారు. శుభకార్యాలకు అధికారుల వద్ద తప్పనిసరిగా అనుమతి పొందాలని, కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని తెలిపారు. ఎవరైనా కరోనా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే డయల్ 100, 112లకు సమాచారం అందించాలని సూచించారు. అంతర్రాష్ట్ర రాకపోకలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు షరతులు కొనసాగుతాయని తెలిపారు.