Breaking News

బ్రేకింగ్: ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా

1 0

ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు అభిప్రాయం తీసుకుని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా పరిస్థితులు చక్కబడ్డాక పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. త్వరలో పరీక్షల తేదీలు ప్రకటిస్తామని పేర్కొంది. పిల్లల ప్రాణాలమీద, వారి భవిష్యత్తుమీద మమకారం ఉన్న ప్రభుత్వంగా సురక్షిత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇందు కోసం కనీవినీ ఎరుగని విధంగా ఏర్పాట్లు కూడా చేశామని, అయినా, దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు, ఇందుకు సంబంధించిన వార్తల పట్ల పరీక్ష రాయాల్సిన పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్న విషయాన్ని ప్రజాప్రభుత్వంగా పరిగణనలోకి తీసుకున్నామని పేర్కొన్నారు.