Breaking News

‘జబర్దస్త్‌’పై రివెంజ్ తీర్చుకున్న అవినాష్

1 0

ఈటీవీలో ప్రసారం అవుతున్న ‘జబర్దస్త్’షోతో పాపులర్ అయిన అవినాష్ ‘బిగ్‌బాస్’తో మరింత పాపులారిటీ సంపాదించాడు. ‘బిగ్‌బాస్’ షో కోసం అన్నం పెట్టి ఆదుకున్న ‘జబర్దస్త్’షోను కూడా వదిలేశాడు. ఈ విషయంపై అవినాష్ ఇటీవల స్పందించాడు. ‘నాకు బిగ్ బాస్ షోకి రమ్మని కాల్ వచ్చింది. జబర్దస్త్ షో యాజమాన్యాన్ని బిగ్ బాస్ షోకి వెళ్తాను అని అడిగాను. కానీ అగ్రిమెంట్ మధ్యలో వెళ్ళిపోతే పది లక్షల రూపాయలు కట్టాలని చెప్పారు. నేను 8 ఏళ్ల నుండి వాళ్ల దగ్గర చేస్తున్నాను అని, సహాయం చేయమని అడిగాను వారి దగ్గర కూడా డబ్బులు లేవు అన్నారు. నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని నేను బిగ్ బాస్ షోకి వెళ్తాను అంటే 10 లక్షలు కట్టమన్నారు. నేను ఏదో 2 లక్షలు, 3 లక్షలు కట్టించుకుంటారు ఏమో అనుకున్నాను కానీ పది లక్షలు కట్టమన్నారు. నేను ఈ విషయంలో వాళ్ళని తప్పు పట్టడం లేదు. వాళ్ల అగ్రిమెంట్ వాళ్లు ఫాలో అవుతారు. ఆ 10 లక్షల కోసం చాలా మంది దగ్గర అప్పు చేశాను. చమ్మక్ చంద్ర, శ్రీముఖి వీళ్ళందరూ నాకు సహాయం చేశారు. అలా జబర్దస్త్ కి 10 లక్షల రూపాయలు కట్టి బిగ్ బాస్‌కు వెళ్లాను. బిగ్ బాస్ తో వచ్చిన డబ్బుతో నా అప్పులన్నీ తీర్చాను’ అని చెప్పుకొచ్చాడు. ఇప్పటికి కూడా తనకు జబర్దస్త్ షోకి వెళ్లాలని ఎక్కడో చిన్న ఆశ ఉందని కానీ వాళ్లు రావద్దని అన్నారని చెప్పాడు. ఈ కారణంగా బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత నుండి అవినాష్ జబర్దస్త్ స్కిట్లలో నటించట్లేదు. కానీ ఇటీవల స్టార్ మాలో మొదలైన ‘కామెడీ స్టార్స్’ అనే కామెడీ షోలో అవినాష్ వస్తున్నాడు.

వర్షిణి యాంకర్‌గా ఉన్న ఈ షోకి శ్రీదేవి విజయ్ కుమార్, శేఖర్ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఈ షో ప్రతి ఆదివారం టెలికాస్ట్ అవుతుంది. చమ్మక్ చంద్ర, కార్తీకదీపం సీరియల్ ఫేమ్ శౌర్య, హిమ కూడా కామెడీ స్టార్స్ లో మనల్ని అలరిస్తున్నారు. మొదటి ఎపిసోడ్ తోనే కామెడీ స్టార్స్ హిట్ టాక్ సంపాదించుకుంది. ఇటీవల టెలికాస్ట్ అయిన మొదటి ఎపిసోడ్‌కు 9.8 టీఆర్పీ వచ్చింది. మామూలుగా అయితే జబర్దస్త్ షోకి 6-7 కంటే ఎక్కువ టీఆర్పీ రాదు. కానీ కామెడీ స్టార్స్ మొదటి ఎపిసోడ్ తోనే 9.8 టీఆర్పీతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో ఎక్కువ శాతం క్రెడిట్ అవినాష్ కే దక్కుతుంది అని అంటున్నారు ప్రేక్షకులు. అలాగే ఈ షో సక్సెస్ ద్వారా ఒకరకంగా జబర్దస్త్ షోపై అవినాష్ రివెంజ్ తీర్చుకున్నారు అని కూడా అంటున్నారు. అలా తన పెర్ఫార్మెన్స్‌తో షోకి ఒక హైలెట్‌గా నిలుస్తున్నాడు అవినాష్. అంతే కాకుండా ఇటీవల విడుదలైన రవితేజ ‘క్రాక్’ సినిమాలో కూడా అవినాష్ నటించాడు.