Breaking News

‘అల్లూరి సీతారామరాజు’ ఉగ్రరూపం వచ్చేసింది

1 0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం RRR. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నాడు. అలాగే ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా కనిపించబోతున్నాడు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్లు సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. గత ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా భీం ఫర్ రామరాజు పేరుతో రామ్ చరణ్‌కు సంబంధించిన ఒక వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఇక ఆ వీడియో చూసిన అభిమానులు రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తారు. తమ హీరోని అద్భుతంగా చూపించారంటూ ఆకాశానికెత్తారు. అయితే ఈ ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చెప్పినట్టే భయంకరమైన లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఈ లుక్‌లో చరణ్ అచ్చం అల్లూరి సీతారామరాజుగా రౌద్రంగా పైకి చూస్తూ విల్లును ఎక్కిపెడుతూ కనిపించాడు.