Breaking News

వైరల్: ఇంటికే పుల్లలు.. జగనన్న పుల్లల పథకం

1 0

ఏపీ సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి రేషన్ పంపిణీ అంటూ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ రేషన్ సరుకులను ఇంటింటికి పంపిణీ చేసేందుకు వాహనాలను కూడా తీసుకు వచ్చారు. ఇక ఈ పథకం ప్రారంభమైన కొద్దిరోజుల్లోనే వాహన డ్రైవర్లు జీతాలు సరిపోవంటూ ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా ఇంటింటికి రేషన్ పంపిణీ పేరుతో ప్రవేశపెట్టిన ఈ వాహనాలను రకరకాలుగా ఉపయోగిస్తున్నారు

.

అందుకు సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. రేషన్ కోసం కేటాయించిన వాహనంలో పుల్లలను తీసుకెళ్తున్న ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. గ్యాస్ ధర పెరిగినందున ఇంటికే పుల్లలు.. జగనన్న పుల్లల పథకం అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు.

source: www.prabhanews.com