నితిన్ హీరోగా నటిస్తున్న‘రంగ్‌దే’ మూవీ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. కీర్తి సురేష్ ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫుల్ కామెడీ ప్యాక్డ్‌గా ట్రైలర్ ఉంది. పీవీడీ ప్రసాద్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ‘మనల్ని ప్రేమించే వాళ్ల విలువ.. మనం వాళ్లను వద్దనుకున్నప్పుడు కాదు.. వాళ్లు మనల్ని అక్కర్లేదనుకున్నప్పుడు తెలుస్తుంది’ వంటి సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ నెల 26న ‘రంగ్‌దే’ మూవీ విడుదల కానుంది.
