Breaking News

‘గాలి సంపత్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది

1 0

శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషించిన ‘గాలి సంపత్’ఈనెల 11న విడుదలై మిక్సుడ్ టాక్ అందుకుంది. ఈ నేపథ్యంలో విడుదలైన వారం రోజులకే ఈ సినిమా ఓటీటీలో వచ్చేస్తోంది. ఈనెల 19 నుంచి ‘ఆహా’లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అనిల్ రావిపూడి నిర్మాతగా వహించిన ఈ చిత్రానికి ‘అలా ఎలా’ దర్శకుడు అనీష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. కాగా ‘ఆహా’లో వరుసగా కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. గత వారం ‘నాంది’రాగా ఈ వారం ‘గాలి సంపత్‌’తో పాటు ‘క్షణక్షణం’ సినిమా కూడా స్ట్రీమింగ్ కానుంది. అటు ఈనెల 26 నుంచి ‘జాంబీరెడ్డి’, ఏప్రిల్ 2 నుంచి ‘చావు కబురు చల్లగా’ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.