Breaking News

‘హరిహర వీరమల్లు’గా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్

1 0

మహాశివరాత్రి కానుకగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. క్రియేటివ్‌ దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ఫస్ట్ లుక్‌‌, గ్లింప్స్‌ను విడుదల చేశారు. పీరియాడికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్‌ను చిత్ర బృందం ఖరారు చేసింది. టైటిల్ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ లుక్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. కాగా ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏఎమ్‌ రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.