అయితే నిజంగా అన్నది మరదలు కాదండోయ్. ఓ హోటల్ యాజమాన్యం. కరోనా కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు బాగా నష్టపోయాయి. ప్రస్తుతం వ్యాక్సిన్ వచ్చినా కొంతమంది ఇంకా రెస్టారెంట్లకు వెళ్లడానికి జంకుతున్నారు. ఈ క్రమంలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు రెస్టారెంట్ల యాజమాన్యాలు రకరకాలుగా ప్రమోషన్లు చేసుకుంటున్నాయి. అయితే ఓ హోటల్ యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. దీంతో హోటల్‌కు ‘రా బావా తిని చూడు’ అని పేరు పెట్టింది. అయితే ఈ హోటల్ ఎక్కడుందో ఏమో తెలియదు. పేరు తెలుగులో ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఓ చోట ఉండి ఉంటుందని అనిపిస్తుంది. దీనిపై నెటిజన్లు మాత్రం ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. నన్ను ఇప్పటివరకూ అలా ఎవరు పిలవలేదు అంటూ కొంతమంది కామెంట్ చేస్తుంటే… మరికొంతమంది పిలవడం వరకు ఓకే బిల్లు ఏ మాత్రం ఏస్తారేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదీ ఏమైనా హోటల్ పేరుతోనే కస్టమర్లను ఆకట్టుకోవడంలో హోటల్ నిర్వాహకులు విజయవంతం అయ్యారనే చెప్పుకోవాలి.