బిగ్ బాస్-4 రియాలిటీ షోలో ఫైనలిస్టు, హైదరాబాద్ వాసి దేత్తడి హారిక తెలంగాణ ప్రభుత్వం నుంచి మెరుగైన అవకాశం అందుకుంది. హారికను తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ బ్రాండ్ అంబాసిడర్గా ప్రభుత్వం నియమించింది. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా ఈ మేరకు నియామక పత్రాన్ని హారికకు అందించారు. ఇకపై తెలంగాణ పర్యాటకానికి హారిక అధికారిక ప్రచారకర్తగా వ్యవహరించనుంది. కాగా ప్రభుత్వం తనను ప్రచారకర్తగా నియమించడంపై హారిక హర్షం వ్యక్తం చేసింది.