Breaking News

‘A1 ఎక్స్‌ప్రెస్’ మూవీ రివ్యూ

2 0

SANDEEP KISHAN A1 EXPRESS MOVIE REVIEW

రేటింగ్: 2.5/5

తెలుగులో స్సోర్ట్స్ డ్రామాలపై సినిమాలు రావడం చాలా అరుదు. రెండేళ్ల క్రితం క్రికెట్ కథ నేపథ్యంతో వచ్చిన ‘మజిలీ’, ‘జెర్సీ’ సినిమాలు మంచి విజయం సాధించాయి. తాజాగా సందీప్ కిషన్ హీరోగా హాకీ ఆట నేపథ్యంలో వచ్చిన ‘A1 ఎక్స్‌ప్రెస్’ఫర్వాలేదనిపించేలా ఉంది. మంచి డ్రామాతో తెరకెక్కిన ఈ మూవీలో గ్రిప్పింగ్ నేరేషన్ లేకపోవడం మైనస్‌గా మారింది. ఆట ఉత్కంఠభరితంగా లేకపోవడంతో తేలిపోయింది.

సంజు (సందీప్ కిషన్) జాలీగా తిరిగే కుర్రాడు. హాకీ ప్లేయర్ లావణ్య (లావణ్య త్రిపాఠి) కోసం యానాం వెళ్లిన అతడు ఆమెతో ప్రేమలో పడతాడు. ఓ వైపు యానాంలోని ఓ హాకీ గ్రౌండ్‌పై రావు రమేష్ కన్నేసి దాన్ని కబ్జా చేయాలని చూస్తాడు. దీంతో సంజూ ఈ హాకీ గ్రౌండ్‌ను కాపాడే బాధ్యతను తీసుకుంటాడు. అసలు సంజూ ఎవరు? అతడికి, హాకీకి ఉన్న సంబంధమేంటి? అన్న అంశాలు మిగతా కథ.

ఈ సినిమా కోసం సందీప్ కిషన్ చాలా కష్టపడ్డాడు. అతడి కష్టం తెరపై కనిపిస్తుంది. లావణ్యతో ప్రేమ సన్నివేశాల్లో పరిణితితో కూడిన నటనను కనపరిచాడు. అటు స్పోర్ట్ ఉమెన్ పాత్రలో లావణ్య త్రిపాఠి గ్లామరస్‌గా నటించింది. ఎమోషన్స్ విషయంలోనూ మంచి నటన కనపరిచింది. హీరో, హీరోయిన్‌ల ప్రేమ సన్నివేశాలతో ఫస్టాఫ్‌ను దర్శకుడు ఈజీగా లాగించేశాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా బాగుంది. ఇది సినిమా గ్రాఫ్‌ను పెంచింది. ఇక సెకండాఫ్‌లో హాకీకి సంజూ ఎందుకు దూరమయ్యాడు? భారత్‌లో జాతీయ క్రీడ అయిన హాకీ ఆడాలంటే రాజకీయంగా వివక్ష తప్పదా అనే అంశాలతో దర్శకుడు సినిమాను నడిపించాడు. కానీ సెకండాఫ్‌లో కథ ఊహించేలా ఉండటం సినిమాకు మైనస్‌గా మారింది. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబోలో వచ్చే సన్నివేశాలు నవ్విస్తాయి. అయితే కొన్నిచోట్ల పలు సన్నివేశాలు ‘సై’ సినిమా కథను గుర్తుకుతెస్తాయి. ఇక రాజకీయ నాయకుడిగా రావు రమేష్ నటన ఈ సినిమాకు ప్లస్ పాయింట్.

ఎంత స్పోర్ట్స్ డ్రామా అయినా ఎమోషన్‌తో ప్రేక్షకులు జర్నీ అయితేనే సినిమా సక్సెస్ అవుతుంది. A1 ఎక్స్‌ప్రెస్ ఇక్కడే పట్టాలు గాడి తప్పింది. మంచి సెటప్ ఉన్పప్పటికీ అనుకున్న రేంజ్‌లో దర్శకుడు ఈ కథను దర్శకుడు డెన్నిస్ జీవన్ తెరకెక్కించలేకపోయాడు. హిప్ హాప్ తమిళ సంగీతం తమిళ వెర్షన్‌కు కుదిరినంత తెలుగులో సూట్ కాలేదు. నేపథ్య సంగీతం లౌడ్‌గా అనిపించింది. ఛాయా గ్రహణం కూడా యావరేజ్‌గానే ఉంది. తమిళ సినిమా రీమేక్ కాబట్టి ముఖ్యంగా దర్శకుడు కూడా మాతృకను ఫాలో అవడంతో సినిమాలో అక్కడక్కడా తమిళ నేటివిటీ కనిపించింది.

చివరగా.. ‘A1 ఎక్స్‌ప్రెస్’కథ ఊహకు అందేలా సాగడంతో ఎంగేజింగ్‌గా అనిపించదు. స్పోర్ట్స్ డ్రామా అంటే కథలో బిగి ఉండాలి. టైటిల్‌లో ఎక్స్‌ప్రెస్ కథనంలో మిస్ అయింది. అయితే ‘A1 ఎక్స్‌ప్రెస్’ప్రయాణం మరీ బోర్ కొట్టదు. రెగ్యులర్‌ సినిమాలు ఇష్టపడేవారు ఈ మూవీని ఒకసారి చూడొచ్చు. అయితే వచ్చే రెండువారాల్లో బాక్సాఫీస్ దగ్గర మంచి పోటీ ఉండటంతో హీరో సందీప్‌కు ఈ సినిమా ఎలాంటి ఫలితం ఇస్తుందో వేచి చూడాల్సిందే.

A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: అర్జున్ (కూకట్ పల్లి)

ఈ వార్తను కూడా చదవండి..

https://atozkaburlu.com/2021/03/05/india-for-ambani-ap-for-adani/