Breaking News

నితిన్ ‘చెక్’ మూవీ రివ్యూ

1 0

NITHIN ‘CHECK’ MOVIE REVIEW AND RATING

రేటింగ్: 2.5/5

టాలీవుడ్‌లో చంద్రశేఖర్ ఏలేటి అంటే ఓ వైవిధ్యమైన దర్శకుడు అనే పేరుంది. ఐతే, అనుకోకుండా ఒకరోజు, ప్రయాణం, సాహసం లాంటి సినిమాలు ఆయన ప్రతిభను చాటిచెప్పాయి. ‘చెక్’ కూడా వైవిధ్యంగా ఉంటుందని ఆశించడంలో తప్పులేదు. కానీ చంద్రశేఖర్ ఏలేటిలో మునుపటి మేజిక్ అయితే కనిపించలేదు. అక్కడక్కడా కొన్ని సీన్‌లలో తప్పితే ఆయన ముద్ర మసకబారినట్లు కనిపించింది.

ఇక కథలోకి వెళ్తే.. ఆదిత్య (నితిన్) తన తెలివితేటలతో చిన్న సైబర్ క్రైమ్స్ చేస్తుంటాడు. అయితే అనుకోకుండా అతడు 40 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఓ ఉగ్రదాడి కేసులో చిక్కుకుంటాడు. దీంతో అతడికి ఉరిశిక్ష పడుతుంది. ఈ కేసును మానస (రకుల్) టేకప్ చేస్తుంది. జైలులోనే చెస్ ఆట నేర్చుకునే ఆదిత్య తన ప్రతిభతో ఈ కేసులో నుంచి ఎలా బయటపడ్డాడన్నదే మిగతా కథ.

తెలుగు సినిమాకు కొత్త కథలు కొత్తేమీ కాదు. అప్పుడప్పుడు వైవిధ్యమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. కానీ ‘చెక్’ పెట్టడంలో దర్శకుడు యావరేజ్ మార్కులు మాత్రమే సంపాదిస్తాడు. దీనికి స్క్రీన్‌ప్లేనే మైనస్. అనుకోకుండా ఒకరోజు, సాహసం సినిమాల్లో ఉండే స్క్రీన్‌ప్లే మేజిక్ ఇందులో మిస్‌ఫైర్ అయ్యింది. ఈ మూవీలో అత్యంత ముఖ్యమైన విషయం ఉగ్రదాడి కేసులో హీరో ఇరుక్కోవడం. ఇది ప్రేక్షకులకు కన్వినియన్స్‌గా అనిపించదు. ఉరిశిక్ష పడేంత తప్పు హీరో ఏం చేశాడన్నది స్పష్టంగా చూపించలేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగానే ఉన్నా హీరో ఫ్లాష్ బ్యాక్ తుస్సుమనిపించింది. ప్రియా ప్రకాష్ వారియర్ పాత్రను పేలవంగా తీర్చిదిద్దడమే దీనికి మైనస్. ‘ఫిదా’ ఫేం సాయిచంద్ ఈ సినిమాకు మరో హైలెట్. రీఎంట్రీలో సాయిచంద్ మంచి పాత్రలను ఎంచుకోవడం అభినందనీయం.

ఆదిత్య పాత్రలో హీరో నితిన్ బాగా నటించాడు. అతడి నటనలో పరిణితి కనిపించింది. రకుల్ కొత్తగా కనిపించినా ఆమె లుక్ బాగోలేదు. ఈ సినిమాకు ప్లస్ పాయింట్ ఏమైనా ఉందంటే అది కళ్యాణి మాలిక్ సంగీతమే. ప్రతి సన్నివేశాన్ని తన బీజీఎంతో అతడు ఎలివేట్ చేశాడు. సినిమాలో ఒకే పాట ఉంది. రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. భవ్య క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. దర్శకుడు ఏలేటి ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నా అతడు సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయాడు. ‘చెక్’లో అనుకున్నంత ఉత్కంఠ లేదు.

చివరగా ‘చెక్’ పూర్తి స్థాయిలో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో విఫలమైంది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి నిమిషం థ్రిల్ చేసే ఎలిమెంట్లను ప్రేక్షకులు ఆశిస్తారు కానీ ఇందులో సినిమా స్టార్టింగే కాస్త నెమ్మదిగా ఉంటుంది. ఈ సినిమాలో మరో మైనస్ మూవీ అంతా సీరియస్‌గా కనిపించడం. జైలులో చాలా బోరింగ్ సన్నివేశాలు ఉన్నాయి. క్లైమాక్స్ ట్విస్టు బాగుంది కాబట్టే సినిమా యావరేజ్‌ ఫలితం సంపాదించింది. లేకపోతే ఈ చెక్ పూర్తిగా విఫలమయ్యేది.

A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: శ్రీరాములు (మూసాపేట)