Breaking News

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర ఎంతో తెలుసా?

0 0

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల రెండు రోజులు విరామం ఇచ్చిన ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ సుమారు 38 పైసలు వరకు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.90.93గా, డీజిల్ ధర రూ.81.32గా నమోదైంది. అటు హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 36 పైసలు పెరగడంతో రూ.94.54కి చేరింది. డీజిల్ ధర 38 పైసలు పెరగడంతో రూ.88.69గా నమోదైంది. రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రజల జేబులు ఖాళీ చేయడంలో మోదీ ప్రభుత్వం గొప్పగా పనిచేస్తోందంటూ ఎద్దేవా చేశారు. కాగా గత 54 రోజుల్లో చమురు ధరలు 25సార్లు పెరిగాయి. ఈ ఏడాదిలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దాదాపుగా రూ.7.50 పెరిగాయి.