Breaking News

కేసీఆర్ బర్త్‌డే యాడ్‌లలో హరీష్ ఎక్కడ?

0 0

కేసీఆర్ పుట్టినరోజు పుణ్యమా అని బుధవారం నాడు నమస్తే తెలంగాణ పత్రికను ఏకంగా 22 పేజీలతో ప్రింట్ చేశారు. అందులో ఫుల్ పేజీ పుట్టినరోజు ప్రకటనలే దాదాపు పది పేజీలు ఉంటే.. హాఫ్ పేజీ.. పావు పేజీ.. ఇంకాస్త చిన్నప్రకటనలు కలిపితే.. మొత్తంగా 22 పేజీల్లో 12 పేజీలు కేసీఆర్ పుట్టినరోజు ప్రకటనలకే జాగా సరిపోయింది. అటు ఒకటిన్నర పేజీలలో సినిమా ప్రకటనలు నిండాయి. ఇతర ప్రకటనలకు ఒక పేజీ ఉంది. అంటే.. మొత్తం 22 పేజీల్లో 14.5 పేజీలు ప్రకటనలతోనే నిండిపోయాయి.

అటు కేసీఆర్ పుట్టినరోజు ప్రకటనల్లో కేసీఆర్ మేనల్లుడు, మంత్రి హరీష్‌రావు ఫోటోను చాలా చోట్ల అస్సలు వాడలేదు. మొదటి పేజీ ప్రకటనలో మంత్రి మల్లారెడ్డి బొమ్మతో టీఆర్ఎస్ నేతలు – మేడ్చల్ జిల్లా పేరుతో వచ్చిన నిలువెత్తు యాడ్‌లో..కేటీఆర్, కవితలకు చోటు దక్కింది. కానీ.. హరీష్‌కు మాత్రం అవకాశం లభించలేదు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు ఇచ్చిన ఫుల్ పేజీ ప్రకనటలోనూ హరీష్‌కు చోటు దక్కలేదు. అదే ప్రకటనలో కేటీఆర్.. కవిత.. సంతోష్‌కు స్థానం లభించింది. అంతేకాదు.. మరో కీలక నేత ఈటెల రాజేందర్ బొమ్మ కూడా కనిపించకపోవటం గమనార్హం. కేసీఆర్ పుట్టినరోజున మంత్రులు హరీష్, ఈటెలకు పెద్ద షాకులే తగిలాయని టీఆర్ఎస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.