Breaking News

వాలెంటైన్స్ డే వెనుక ఉన్న చరిత్ర ఏంటి?

0 0

ప్రేమలో ప్రతి యువతి, యువకుడికి వాలెంటైన్స్ డే చాలా ప్రత్యేకమైనది. ఈ రోజు సందర్భంగా ప్రేమికులు గులాబీలతో శుభాకాంక్షలు చెప్పుకుంటారు. విలువైన బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే వీరిలో చాలామందికి వాలెంటైన్స్ డే వెనుక ఉన్న చరిత్ర ఏంటో తెలియదు. అలాంటి వారి కోసమే ఈ ప్రత్యేకమైన ఆర్టికల్.

సెయింట్ వాలెంటైన్ అనే వ్యక్తి ఓ కైస్తవ ప్రవక్త. మూడో శతాబ్దంలో రోమ్‌ నగరంలో ఉండేవాడు. ఆ కాలంలో రోమ్‌ నగరాన్ని రెండో క్లాడియస్ అనే చక్రవర్తి పాలించేవాడు. ఆయన తన రాజ్యంలో వివాహాలను నిషేధించారు. మగవాళ్లు పెళ్లి చేసుకుంటే మంచి సైనికులు కాలేరన్న అభిప్రాయంతో రోమ్ చక్రవర్తి ఈ నిర్ణయం తీసుకున్నాడని ప్రతీతి. అయితే మగవాళ్లు పెళ్లిళ్లు చేసుకోవద్దన్న రోమన్ చక్రవర్తి ఆదేశాలు వాలెంటైన్‌కు నచ్చలేదు. దాంతో రోమ్ చక్రవర్తి ఆదేశాలను అతను ధిక్కరించి రహస్యంగా వివాహాలు జరిపించాడు. ఈ విషయం తెలుసుకున్న క్లాడియస్ వాలెంటైన్‌ను జైలులో పెట్టి మరణశిక్ష విధించారు. ఈ సమయంలోనే జైలులో జైలర్ కుమార్తెతో వాలెంటైన్ ప్రేమలో పడ్డాడు. ఫిబ్రవరి 14న మరణశిక్ష అమలు చేయడానికి ముందు వాలెంటైన్ జైలర్ కుమార్తెకు లవ్ లెటర్ పంపించాడు. అటు రోమన్‌ల ఫెస్టివల్‌ను క్రైస్తవ సంప్రదాయంగా మార్చాలని చర్చి భావించింది. ఫిబ్రవరి 14న సెయింట్ వాలెంటైన్‌ చనిపోయారు కాబట్టి ఆయన గుర్తుగా ఈ ఫెస్టివల్‌ను జరుపుకోవాలని చర్చి సూచించింది. తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రజలు క్రమంగా సెయింట్ వాలెంటైన్ పేరు వాడటం మొదలుపెట్టారు. క్రమంగా అది వాలంటైన్స్ డేగా స్థిరపడిపోయింది. వాలెంటైన్స్ డేను తొలిసారిగా 496వ సంవత్సరంలో జరుపుకున్నారని చరిత్ర చెప్తోంది.