శ్రీకాకుళం జిల్లా భీరిపురం అనే చిన్న గ్రామం గత 57 ఏళ్లుగా గొప్ప ఐక్యతను ప్రదర్శిస్తోంది. ఇక్కడి ప్రజలంతా ఒక్కతాటిపైకి వచ్చి పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవంగా మారుస్తున్నారు. దీంతో అక్కడ పంచాయతీ ఎన్నికలు 57 ఏళ్లలో ఒక్కసారి కూడా జరగలేదు. ఈ ఆరు దశాబ్దాలలో జరిగిన అన్ని పంచాయతీ ఎన్నికలలో గ్రామస్తులు పాల్గొనలేదు. చేతికి సిరా గుర్తును ఒక్కసారి కూడా వేసుకోలేదు. ఈసారి కూడా సీఎం జగన్ పిలుపుతో గ్రామాభివృద్ధికి నిధులొస్తాయని ఎన్నికల పోరాటాలకు వెళ్ళకుండా ఒకే అభ్యర్థిని విజేతగా నిలబెట్టడానికి గ్రామం ఐక్యంగా నిలవడం విశేషం. ఈ ఏకగ్రీవ ఎన్నికల విధానం వార్డ్ సభ్యుల ఎన్నికలతో పాటు సర్పంచ్ స్థానానికి సైతం జరగడం విశేషమని చెప్పొచ్చు. కాగా 1500 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 1100 మంది ఓటర్లు ఎనిమిది మంది వార్డు సభ్యులున్నారు.