Breaking News

ఈనెల 26న భారత్ బంద్

0 0

జీఎస్టీకి వ్యతిరేకంగా అఖిల భారత వర్తక సమాఖ్య(సీఏఐటీ) ఈనెల 26న భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. జీఎస్టీ వల్ల వర్తకులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయని సీఏఐటీ ఆరోపించింది. జీఎస్టీలో లోటుపాట్లపై ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కేంద్రం, జీఎస్టీ కౌన్సిల్ స్పందించలేదని విమర్శించింది. జీఎస్టీని సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా చేయడంలో జీఎస్టీ కౌన్సిల్ విఫలమైందని, కేవలం ఆదాయం పెంచుకునేందుకే జీఎస్టీని ప్రజలపై రుద్దుతోందని వ్యాఖ్యానించింది. కాగా అదేరోజు రహదారుల దిగ్బంధనం కార్యక్రమం ఉంటుందని అఖిలభారత రవాణా సంక్షేమ సంఘం (ఐట్వా) వెల్లడించింది. పరోక్షంగా సీఏఐటీ బంద్‌కు తాము మద్దతు పలుకుతున్నట్లు ఐట్వా ప్రకటించింది.