Breaking News

పోస్టల్ శాఖలో 1,150 ఉద్యోగాలు

0 0

కొత్త తపాలా కార్యాలయాల ఏర్పాటును దాదాపు పక్కన పెట్టిన తపాలాశాఖ ఉన్న శాఖల్లో కొత్త ఉద్యోగులను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేస్తోంది. తపాలా కార్యాలయాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో తాత్కాలిక ఉద్యోగులతో సేవలు అందించనుంది. పోస్టాఫీసులు ఉన్న ప్రాంతాల్లో కూడా, పని భారం పెరిగితే దాన్ని తాత్కాలిక ఉద్యోగులతో నిర్వహించనుంది. ఈ మేరకు తాత్కాలిక పద్ధతిలో 1,150 ఉద్యోగాల భర్తీకి తాజాగా తపాలాశాఖ తెలంగాణ సర్కిల్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌ పేరుతో ఉద్యోగులను నియమించుకోనుంది. కాస్త పనిభారం ఉండే చోట గరిష్టంగా 5 గంటలు, లేనిచోట అంత కంటే తక్కువ గంటలు పనిచేయాల్సి ఉంటుంది.

ఈ పోస్టుల్లో బ్రాంచీ పోస్టుమాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ లాంటివి ఉన్నాయి. పోస్టుమాస్టర్‌కు సంబంధించి 5 గంటలు పనిచేస్తే రూ.14,500, 4 గంటలు పనిచేస్తే రూ.12 వేలు నెల వేతనంగా చెల్లిస్తారు. అలాగే అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్, డాక్‌ సేవక్‌ పోస్టులకు సంబంధించి ఆ మొత్తం రూ.12 వేలు, రూ.10 వేలుగా ఉంది. పదో తరగతి ఉత్తీర్ణులైన 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారు (వయోపరిమితి నిబంధనలు వర్తిస్తాయి) దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు www.appost.in వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

గమనిక: ఈ పోస్టును మరింత మందికి చేరవేసేందుకు షేర్ చేయండి.