టీమిండియాలో రోహిత్ శర్మ స్థానంపై మళ్లీ విమర్శల వర్షం మొదలైంది. ప్రస్తుతం ఆడుతున్న టెస్టుల్లో అతడు నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకుంటుండటంతో అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. హాట్ స్టార్ లాంటి లైవ్ స్ట్రీమింగ్ వేదికల వద్ద అభిమానులు రోహిత్ గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఓపెనర్‌గా రోహిత్ ఎందుకు దండగ అని మాట్లాడుకుంటున్నారు. రోహిత్ స్థానంలో బ్యాటింగ్ ఆల్‌రౌండర్ పాండ్యాను జట్టులోకి తీసుకుని అద్భుతంగా ఆడుతున్న వాషింగ్టన్ సుందర్‌ను ఓపెనర్‌గా పంపించాలని అభిమానులు కోరుతున్నారు. అటు ఇంగ్లండ్‌తో తదుపరి టెస్టులో షాబాజ్ నదీం స్థానంలో రవీంద్ర జడేజా లేదా కుల్దీప్ను జట్టులోకి తీసుకోవాలని కూడా వారు సూచిస్తున్నారు.
