Breaking News

ఇంగ్లండ్‌కు 243 పరుగులు ఆధిక్యం

0 0

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న టెస్టులో ఇంగ్లండ్‌దే ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 377 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఫాలో ఆన్‌లో పడింది. కానీ ఇంగ్లండ్ భారత్‌కు ఫాలో ఆన్ ఇవ్వడానికి ఇష్టపడకుండా రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లో పుజారా, పంత్ తప్పితే మిగతా అందరూ గుడ్డిగా ఆడినా వాషింగ్టన్ సుందర్ (85 నాటౌట్), అశ్విన్ (31) పోరాడటంతో భారత్ చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్, కోహ్లి, రహానె రెండో ఇన్నింగ్సులో అన్నా బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంది. కాగా ఇంగ్లండ్ బౌలర్లలో బెస్‌కు నాలుగు వికెట్లు దక్కగా అండర్సన్ 2 వికెట్లు, లీచ్ 2 వికెట్లు, ఆర్చర్ 2 వికెట్లు సాధించారు.