అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న‘పుష్ప’చిత్ర షూటింగ్ రాజమహేంద్రవరం సమీపంలోని మారేడుమిల్లి, రంపచోడవరం అడవుల్లో జరిగింది. తాజాగా ఈ షెడ్యూల్ పూర్తయింది. దీంతో అల్లు అర్జున్ సహా చిత్ర బృందం హైదరాబాద్ చేరుకున్నారు. అయితే అక్కడి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న అల్లు అర్జున్ కారవాన్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అల్లు అర్జున్ ఆ వాహనంలో లేడని తెలుస్తోంది. వెనుక నుంచి వచ్చిన లారీ బన్నీ కారవాన్‌ను ఢీకొట్టింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరోవైపు ఏజెన్సీ ఏరియాలో ఈ మూవీ షూటింగ్ పూర్తయిందంటూ చిత్ర బృందం ప్రకటన విడుదల చేసింది.
