భారత్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ వినియోగానికి దరఖాస్తు చేస్తున్న తొలి సంస్థగా నిలిచిన ఫైజర్ ఇప్పుడు వెనక్కి తగ్గింది. తన దరఖాస్తును ప్రస్తుతానికి వెనక్కి తీసుకుంటున్నట్లు ఫైజర్ ప్రకటించింది. వ్యాక్సిన్ రెగ్యులేటర్ మరింత సమాచారం కోరిందని, దీంతో ప్రస్తుతానికి తమ దరఖాస్తును ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు ఫైజర్ సంస్థ వెల్లడించింది. రెగ్యులేటర్ అధికారులు కోరిన అదనపు సమాచారంతో భవిష్యత్లో మరోసారి దరఖాస్తు చేసుకుంటామని పేర్కొంది. సీరమ్, భారత్ బయోటెక్ కంటే ముందే దేశంలో కరోనా వ్యాక్సిన్ వినియోగం కోసం ఫైజర్ దరఖాస్తు చేసింది. ప్రపంచంలోనే తొలిసారి అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన వ్యాక్సిన్ ఫైజర్ కావడం గమనార్హం. ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి తొలిసారిగా UK అనుమతి ఇచ్చింది.