Breaking News

నిత్యామీనన్ ‘నిన్నిలా నిన్నిలా’ ట్రైలర్ విడుదల

0 0

‘అత్తారింటికి దారేది’ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ జీ స్టూడియోస్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘నిన్నిలా.. నిన్నిలా’. ఈ మూవీ ట్రైలర్‌ను హీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం విడుదల చేశాడు. అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న ఈ మూవీకి అని.ఐ.వి.శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌లోని స‌న్నివేశాలు ఆసక్తి రేకేత్తిస్తున్నాయి. ఫిబ్ర‌వ‌రి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.