పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం సామాన్యులపై మరోసారి బండరాయి వేసింది. పెరుగుతున్న ఛార్జీలు చాలవన్నట్లు పెట్రోల్, డీజిల్‌పై మరోసారి పన్నులను పెంచింది. లీటర్ పెట్రోల్‌పై రూ.2.50, లీటర్ డీజిల్‌పై రూ.4 వ్యవసాయ సెస్‌లు విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో పెట్రోల్, డీజిల్ రేట్లు మరింత పెరిగి సామాన్యుడి నడ్డి విరగొట్టనున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100కి చేరిన సంగతి తెలిసిందే.