Breaking News

నిర్మలమ్మ బడ్జెట్-2021 విశేషాలు

1 1

ఆరు రంగాలకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత.. 1) వైద్య ఆరోగ్య రంగం 2) మౌలిక రంగం 3) సమ్మిళిత అభివృద్ధి 4) మానవ వనరులు, నైపుణ్యాల అభివృద్ధి 5) ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ 6) అందరికీ సుపరిపాలన

✿ బడ్జెట్‌లో మరో సరికొత్త పథకం… ఈ పథకానికి పీఎం ఆత్మనిర్భర్ ఆరోగ్య పథకంగా నామకరణం, రూ.64,180 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటన
✿ కరోనా వ్యాక్సినేషన్ కోసం రూ.35,400 కోట్లు కేటాయింపు, భారత్‌తో పాటు మరో 100 దేశాలకు వ్యాక్సిన్‌
✿ ఈ ఆర్థిక సంవత్సరంలోనే LIC పబ్లిక్ ఇష్యూ
✿ ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్‌డీఐల శాతం భారీగా పెంపు
✿ బీమా కంపెనీల్లో ఎఫ్‌డీఐల పరిమితి 74 శాతానికి పెంపు
✿ హెల్త్ కేర్‌కు రూ.2లక్షల కోట్లు కేటాయింపు
✿ వాహనాల కాలుష్యాన్ని తగ్గించడంపై ప్రత్యేక దృష్టి .. వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్ల కాలపరిమితి, కమర్షియల్ వాహనాలకు 15 ఏళ్ల కాలపరిమితి; కాలం తీరిన వాహనాలను తుక్కుగా మార్చే పథకం
✿ జల జీవన్‌ మిషన్‌కు రూ. 2,87,000 కోట్లు కేటాయింపు
✿ నేషనల్‌ డిసీజ్‌ కంట్రోల్‌ సిస్టం మరింత పటిష్టం, దేశ వ్యాప్తంగా 15 ఎమర్జెన్సీ సెంటర్లు

✿ రక్షిత మంచినీటి పథకాల కోసం రూ. 87 వేల కోట్లు, 2 కోట్ల 18 లక్షల ఇళ్లకు రక్షిత మంచినీరు
✿ ఐదు ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.5వేల కోట్లు కేటాయింపు; 11వేల కి.మీ. జాతీయ రహదారుల కారిడార్‌ నిర్మాణం. పశ్చిమ్‌ బెంగాల్‌లో రూ.25వేల కోట్లతో రహదారుల నిర్మాణం. అసోంలో రహదారుల అభివృద్ధికి రూ.19వేల కోట్లు. కోల్‌కతా-సిలిగురి రహదారి విస్తరణ
✿ పన్ను చెల్లింపు ప్రక్రియ సరళీకరణకు మరిన్ని చర్యలు, పెన్షన్లపై ఆధారపడే సీనియర్ సిటిజన్‌లకు రిటర్న్ ఫైలింగ్ నుంచి మినహాయింపు
✿ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు రూ.5వేల కోట్ల కేటాయింపులు
✿ దేశంలో తొలిసారిగా డిజిటల్ పద్ధతిలో జనాభా లెక్కింపు ప్రక్రియ

✿ దేశంలో కొత్తగా 100 సైనిక పాఠశాలలు, ఆదివాసీ ప్రాంతాల్లో 750 ఏకలవ్య పాఠశాలలు
✿ ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన
✿ విద్యుత్ రంగానికి రూ.3.05 లక్షల కోట్లు కేటాయింపు
✿ పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా రూ.2,200 కోట్లతో ఏడు కొత్త ప్రాజెక్టులు

✿ ఒకే దేశం ఒకే రేషన్‌కార్డు విధానం దేశంలో అన్ని ప్రాంతాల్లో అమలు. వలస కార్మికులకు దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకునే అవకాశం. కుటుంబ సభ్యులు వేర్వేరు చోట్ల ఉంటే వాటా ప్రకారం రేషన్‌ తీసుకునేలా సౌలభ్యం
✿ రూ.50 లక్షల నుంచి రూ.2కోట్ల పెట్టుబడి పరిమితి వరకూ చిన్న సంస్థలుగా గుర్తింపు. కొత్త ప్రాజెక్టుల కోసం ప్రస్తుత ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఉపసంహరణ తప్పనిసరి

✿ గృహరుణాలపై వడ్డీ రాయితీ 2022 మార్చి వరకు కొనసాగింపు
✿ చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం వివాద పరిష్కార కమిటీ
✿ NRIలకు డబుల్ ట్యాక్సేషన్ నుంచి ఊరట
✿ అన్ని కేటగిరిల వర్కర్లకు ఇకపై కనీస వేతనాల అమలు వర్తింపు

✿ 2022 నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు
✿ ఖరగ్‌పూర్-విజయవాడ మధ్య ఈస్ట్-కోస్ట్ సరుకు కారిడార్‌ ఏర్పాటు
✿ ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 20 వేల కోట్లు
✿ డిస్కంలకు రూ. 3,05,984 కోట్ల సాయం
✿ దేశ వ్యాప్తంగా విశాఖ సహా ఐదు చోట్ల ఆధునిక ఫిషింగ్ హార్బర్లు… చెన్నై, విశాఖల్లో మేజర్ హార్బర్లు
✿ వ్యవసాయ రంగానికి రూ. 75,100 కోట్లు కేటాయింపు

✿ వన్ నేషన్-వన్ రేషన్ పథకంతో 69 కోట్ల మందికి లబ్ధి
✿ స్టార్టప్‌లకు పన్ను రాయితీల పొడిగింపు
✿ వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబ్‌లలో ఎటువంటి మార్పు లేదని ప్రకటన

✿ మొబైల్ రేట్లు పెరిగే అవకాశం
✿ నైలాన్ దుస్తుల రేట్లు తగ్గే అవకాశం
✿ తగ్గనున్న బంగారం, వెండి ధరలు
✿ పెరగనున్న కార్ల స్పేర్ పార్టుల ధరలు

✿ పెరగనున్న ఇంపోర్టెడ్ వస్తువుల ధరలు
✿ హోమ్ లోన్స్‌పై వడ్డీ రాయితీ కొనసాగింపు
✿ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు అదనపు నిధుల కేటాయింపు

✿ కొచ్చి మెట్రో రెండో దశకు కేంద్రం సాయం
✿ చెన్నై మెట్రోకు రూ. 63,246 కోట్లు
✿ బెంగళూరు మెట్రోకు రూ.14,788కోట్లు

✿ గెయిల్, ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌లో పెట్టుబడుల ఉపసంహరణ
✿ తేయాకు తోటల కార్మికుల సంక్షేమం కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయింపు