Breaking News

ఏప్రిల్ 9న ‘వకీల్ సాబ్’ రీ ఎంట్రీ

0 0

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘పింక్’ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 9న ప్రజాకోర్టులోకి రానుంది. రాజకీయ రంగ ప్రవేశం తర్వాత తొలిసారిగా పవన్ వెండితెరపై ఈ సినిమాతోనే తన అభిమానులను సందడి చేయనున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు మూవీని నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో శ్రుతిహాసన్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సూపర్ ఫామ్‌లో ఉన్న ఎస్.ఎస్.తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.