Breaking News

కేజీఎఫ్-2 రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది

1 0

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న KGF-2 రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. జూలై 16న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. సింహం ముందు మిషన్ గన్‌తో నిల్చున్న యష్ ఫోటోతో యూనిట్ సభ్యులు రిలీజ్ డేట్ ప్రకటించారు. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ఇప్పటికే అనేక రికార్డులు బద్దలుగొట్టిన విషయం తెలిసిందే.