ఇళయ దళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీల్లో వచ్చేసింది. అయితే ఈ సినిమా కోసం తొలుత అమెజాన్ ప్రైమ్ రూ.20.5 కోట్లు ఖర్చు చేసింది. డీల్ ప్రకారం మార్చి 2న ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమ్ చేయాల్సి ఉంది. కానీ అమెజాన్ ప్రైమ్ త్వరగా ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లి రికార్డు వ్యూస్ సాధించాలని ఆరాటపడింది. ఎర్లీ స్ట్రీమింగ్ కోసం అదనంగా నిర్మాతలకు రూ.15.5 కోట్లు ఇచ్చినట్లు ఫిలింనగర్లో టాక్ నడుస్తోంది. దీంతో మొత్తం ‘మాస్టర్’ డిజిటల్ రైట్స్ కోసం అమెజాన్ వారు రూ.36 కోట్లు ఖర్చుపెట్టడం సినీ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఇప్పటివరకు దక్షిణాదిలో అత్యధికంగా ఓటీటీకి అమ్ముడుపోయిన చిత్రం ‘మాస్టర్’ అని తెలుస్తోంది. కాగా రెండు వారాల్లోనే ఓ విజయవంతమైన మూవీ ఓటీటీలో వచ్చేయడంతో నిర్మాతలు లాభపడినా.. తాము నష్టపోతామని డిస్ట్రిబ్యూటర్లు గగ్గోలు పెడుతున్నారు.