Breaking News

ఓ ఇంటి వాడైన టీమిండియా క్రికెటర్

0 0

టీమిండియా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ బుధవారం నాడు ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి వైశాలి విశ్వేశ్వరన్‌ను చెన్నైలో అతడు పెళ్లి చేసుకున్నాడు. ఓ ఫంక్షన్ హాలులో కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో మాత్రమే ఈ పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా పలువురు టీమిండియా క్రికెటర్లు విజయ్ శంకర్‌కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అటు విజయ్ శంకర్ ఆడుతున్న ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ట్విట్టర్ వేదికగా అతడి పెళ్లి ఫోటోను షేర్ చేసి విషెస్ తెలియజేసింది.