నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో నలుగురు వ్యక్తులు 30 నిమిషాల్లో 30 కేజీల కమలా పండ్లను తిన్నారు. ఎందుకు ఈ పనిచేశారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. అసలు కథలోకి వెళ్తే వాంగ్ అనే వ్యక్తితో పాటు అతడి ముగ్గురు సహ ఉద్యోగులు వ్యాపార పని నిమిత్తం యునాన్ ప్రావిన్స్‌కు వచ్చారు. తిరిగి వెళ్తూ 30 కేజీల ఆరెంజెస్‌ను కొనుగోలు చేశారు. విమానం ఎక్కబోగా లగేజ్ ఎక్కువగా ఉన్నందున కిలోకు పది యువాన్ల చొప్పున 300 యువాన్లు అంటే భారత కరెన్సీలో రూ.3,400 అదనంగా చెల్లించాలని విమాన సిబ్బంది చెప్పారు. అంత నగదు చెల్లించే పరిస్థితి లేదని భావించిన ఆ నలుగురు 30 కేజీల కమలా పండ్లను 30 నిమిషాల్లో తినేశారు. అనంతరం విమానం ఎక్కి తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.