Breaking News

‘కోయిలమ్మ’ నటుడిపై లైంగిక వేధింపుల కేసు

0 0

స్టార్ మాటీవీలో ప్రసారమైన ‘కోయిలమ్మ’ సీరియల్‌లో సమీర్ క్యారెక్టర్‌లో నటించిన నటుడు అమర్ శశాంకపై హైదరాబాద్ రాయదుర్గం పీఎస్‌లో కేసు నమోదైంది. అమర్‌ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అమర్‌పై లైంగక వేధింపుల కేసు నమోదు చేశారు. అటు అమర్‌ తమ వద్ద రూ. 5 లక్షలు తీసుకున్నాడని, ఆ డబ్బు అడిగినందుకు తాగి తమపై దాడి చేయడమే కాకుండా లైంగికంగా వేధించాడంటూ బాధిత యువతి ఫిర్యాదులో ఆరోపించింది. అంతేగాక పోలీస్ స్టేషన్‌లో కూడా అమర్‌ సదరు యువతిపై విచక్షణరహితంగా దాడికి దిగుతూ పోలీసుల ఎదుటే హల్‌చల్‌ చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.