ప్రపంచ వ్యాప్తంగా గత ఏడాది కార్ల అమ్మకాలలో జపాన్ కంపెనీ టయోటా అగ్రస్థానంలో నిలిచింది. కరోనా కారణంగా వాహన విక్రయాలు తగ్గినా జర్మనీ కంపెనీ వోక్స్వ్యాగన్కు టయోటా గట్టి పోటీ ఇచ్చి అత్యధికంగా కార్లను విక్రయించింది. 2020లో తమ గ్రూప్ కంపెనీ వాహనాల సేల్స్ 11.3 శాతం పడిపోయినా 9.528 మిలియన్ల వాహనాలను విక్రయించామని టయోటా తెలిపింది. ఇదే సమయంలో వోక్స్వ్యాగన్ 9.305 మిలియన్ల కార్లను అమ్మింది. కరోనా లాక్డౌన్ కారణంగా అంతర్జాతీయంగా కొన్నినెలల పాటు వాహనాల తయారీ, విక్రయాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కాగా తమ దృష్టి ర్యాంకులపై కాదని, వినియోగదారులకు మెరుగైన సేవలందించడమే ప్రథమ లక్ష్యమని టయోటా ప్రతినిధి తెలిపారు.