పార్లమెంట్ క్యాంటీన్లో ధరల రాయితీకి కేంద్రం స్వస్తి పలికింది. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొద్దిరోజుల ముందు క్యాంటీన్లో కొత్త ధరలతో కూడిన ఆహారపదార్థాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. వెజ్ బఫె ధర రూ.500, నాన్ వెజ్ బఫె ధరను రూ.700కు పెంచింది. హైదరాబాద్ మటన్ బిర్యానీ ధరను రూ.65 నుంచి రూ.150కి పెంచింది. అటు వెజ్ మీల్ ధరను రూ.100గా నిర్ణయించింది. ఖర్చులను కట్టడి చేసేందుకు ధరలు పెంచడంతో ఏటా రూ.8 కోట్లు ఆదా కానున్నట్లు సమాచారం. అలాగే ఇప్పటివరకు పార్లమెంట్ క్యాంటీన్‌ను నార్తన్ రైల్వే నిర్వహించగా.. తాజాగా ఆ బాధ్యతలను ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించనున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. కాగా రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.