తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి కేటీఆర్ శుభవార్తను అందించారు. త్వరలోనే తమ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ భవన్లో విద్యుత్ కార్మిక సంఘం సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి అంశంపై త్వరలో సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, మరో 50వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.