ఈనెల 24న లండన్‌లో ఓ వ్యక్తి నగ్నంగా బ్రిటీష్ మ్యూజియం చుట్టూ పరుగులు తీశాడు. పోలీసులు సదరు వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షులు మీడియాతో మాట్లాడారు. సాయంత్రం 3:45 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి నగ్నంగా రోడ్డు మీదకు వచ్చాడని.. చాలా మంది అతడిని చూసి షాకయ్యారని తెలిపారు. ఎందుకు నగ్నంగా రోడ్డు మీదకు వచ్చావని కొందరు అతడిని ప్రశ్నించగా ‘నా బట్టలు ఉతుక్కోవడానికి ఒంటి మీద ఉన్నవి కూడా తీసేశానని, సరదాగా కాసేపు రోడ్డుపై నడిచేందుకు ఇలా వచ్చాను’ అంటూ సమాధానం ఇచ్చాడని పేర్కొన్నారు. కాగా రోడ్డుపై ఇష్టం వచ్చినట్లు నగ్నంగా తిరిగిన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు వివరణ ఇచ్చారు.