Breaking News

వీడియో: ప్రాణం నిలిచింది.. బైక్ ముక్కలైంది

1 0

సోషల్ మీడియాలో రెండు రోజులుగా ఓ వీడియో వైరల్‌గా మారింది. సదరు వీడియోలో రైల్వేగేట్ వద్ద ఓ యువకుడి నిర్లక్ష్యానికి బైక్ ముక్కలు ముక్కలైనట్లు కనిపిస్తోంది. బైక్‌పై ట్రాక్ దాటేందుకు సదరు యువకుడు ప్రయత్నించగా బైక్ జారి కిందపడిపోయింది. ఆ సమయంలో రైలు రావడం గమనించిన ఆ యువకుడు బైక్ వదిలేసి దూరంగా వెళ్లాడు. వేగంగా వచ్చిన రైలు ధాటికి బైక్ తునాతునకలైంది. అయితే ఈ వీడియో ఈనెల 24న రాజమండ్రిలో జరిగినట్లు ప్రచారం జరుగుతుండగా కొందరు నెటిజన్లు రాజమండ్రి కాదని గట్టిగా వాదిస్తున్నారు. దీంతో ఏ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందో స్పష్టత రావాల్సి ఉంది.