Breaking News

ఎల్లుండి నుంచి ఓటీటీలో ‘మాస్టర్’

1 0

ఇళయ దళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ సంక్రాంతికి విడుదలై మంచి కలెక్షన్లు రాబడుతోంది. ముఖ్యంగా తెలుగులో 30 శాతానికి పైగా లాభాలు కూడా వచ్చాయని సమాచారం. అయితే విడుదలైన రెండు వారాల్లోనే ఈ మూవీ ఓటీటీల్లో ప్రత్యక్షమవుతోంది. ఈనెల 29 నుంచి అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమ్ చేయనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. విజయ్ సేతుపతి విలన్‌గా ఈ మూవీలో తన నటనతో అదరగొట్టడంతో మాస్ ప్రేక్షకులను కూడా అలరించాడు. తొలుత 50 శాతం ఆక్యుపెన్సీతో ఈ భారీ బడ్జెట్ సినిమాకు కలెక్షన్లు ఎలా ఉంటాయోనని నిర్మాతలు తర్జన భర్జన పడ్డారు. కాగా తమిళంలో కూడా ఈ సినిమా భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టింది. రివ్యూలు కూడా యావరేజ్ అని వచ్చినా టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని రాబట్టింది. అటు ఈనెల 29నే రవితేజ ‘క్రాక్’ మూవీ ‘ఆహా’ ఓటీటీల్లో విడుదల కావాల్సి ఉన్నా నిర్మాతల కోరిక మేరకే ఓ వారం ఆలస్యంగా అంటే ఫిబ్రవరి 5న ‘క్రాక్’ ఓటీటీలో ప్రేక్షకులకు అందుబాటులో రానుంది.