Breaking News

ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

0 0

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు తొలి దశ నోటిఫికేషన్ విడుదలైంది. విజయనగరం, ప్రకాశం జిల్లాలకు తొలి విడుత ఎన్నికలు లేవని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వెల్లడించారు. రెవిన్యూ డివిజన్ ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఉ. 6:30 గంటల నుంచి మ. 3:30 వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించడం తమ బాధ్యతగా పేర్కొన్నారు. రాజ్యాంగ ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికల నిర్వహణ కమిషన్ విధి అని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. సుప్రీం తీర్పును తక్షణం పాటిస్తామన్నారు. 2019 ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నామని అన్నారు.

ఎన్నికల నోటిఫికేషన్ వివరాలు
✿ జనవరి 25: అభ్యర్థుల నుంచి నామినేషన్‌ల స్వీకరణ
✿ జనవరి 27: నామినేషన్ దాఖలుకు చివరి తేదీ
✿ జనవరి 28: నామినేషన్‌ల పరిశీలన
✿ జనవరి 29: నామినేషన్‌లపై అభ్యంతరాల పరిశీలన
✿ జనవరి 30: అభ్యంతరాలపై తుది నిర్ణయం, 31: నామినేషన్‌ల ఉపసంహరణకు తుది గడువు
✿ ఫిబ్రవరి 5: పోలింగ్ తేదీ, అదేరోజు సా.4 గంటలకు ఎన్నికల లెక్కింపు