Breaking News

RRR రిలీజ్ డేట్ లీక్

2 0

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రౌద్రం రణం రుధిరం (RRR)’మూవీ రిలీజ్ డేట్ లీకైంది. ఈ సినిమా విడుదల కోసం సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న వేళ ఈ ఏడాది అక్టోబర్ 8న రిలీజ్ అవుతున్నట్లు ఈ సినిమాలో నటిస్తున్న ఐరిష్ నటి అలిసన్ డూడీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే ఇది వైరల్ కావడంతో కాసేపటికే ఆమె తన పోస్ట్ డిలీట్ చేసింది. కాగా దసరా సెలవుల సందర్భంగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి, సమ్మర్ తర్వాత టాలీవుడ్‌లో దసరాకు భారీ సినిమాలు రిలీజవుతుంటాయి. దీంతో సెలవుల్లో కలెక్షన్లు కుమ్మేసే అవకాశం ఉంటుంది.