ప్రస్తుత తమిళ హీరోలలో రజినీకాంత్ తర్వాత మార్కెట్ ఉన్న హీరో సూర్య మాత్రమే. అతడి సినిమాలు తెలుగులో మంచి కలెక్షన్లు రాబడతాయి. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో తెలుగులో నేరుగా సినిమా తీయాలని ఆరాటపడుతున్న హీరో సూర్య ఎట్టకేలకు ఆ కలను నెరవేర్చుకునే పనిలో పడ్డాడు. తెలుగులో సూర్య నటించే సినిమాకు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నాడు. ఇటీవల బోయపాటి చెప్పిన కథ సూర్యకు బాగా నచ్చిందని తెలుస్తోంది. ఈ మూవీ దిల్ రాజు బ్యానర్లో నిర్మితం కానుందని సమాచారం. కాగా దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతం బోయపాటి, బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నాడు. బాలయ్య సినిమా విడుదలైన తర్వాత వచ్చిన ఫలితాన్ని బట్టి సూర్య డైరెక్టర్ బోయపాటితో సినిమాను అనౌన్స్ చేస్తాడేమోనంటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. సూర్యతో బోయపాటి తీయనున్న సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది.
