గత ఏడాది‘భీష్మ’ లాంటి ఘనవిజయం తర్వాత హీరో నితిన్ ఈ ఏడాది నెల రోజుల వ్యవధిలో రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నాడు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్న ‘చెక్’ ఫిబ్రవరి 19న విడుదలవుతుండగా.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగ్ దే’ మార్చి 26న విడుదలకు సిద్ధమవుతోంది. ‘చెక్’లో నితిన్‌కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్ నటించగా ‘రంగ్ దే’లో కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘మనమంతా’ సినిమా తర్వాత చంద్రశేఖర్ ఏలేటి తీసిన సినిమా ‘చెక్’. చదరంగం ఆట నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ రెండు సినిమాలు కాకుండా నితిన్ చేస్తున్న మరో సినిమా ‘అంధాదున్’. బాలీవుడ్‌లో హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో దర్శకుడు మేర్లపాక గాంధీ రీమేక్ చేస్తున్నాడు.
