Breaking News

చేతులు కలిపి పోరాటానికి దిగిన ఎన్టీఆర్, రామ్‌చరణ్

1 0

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘RRR (రౌద్రం రణం రుధిరం)’ క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభమైంది. భారీ స్థాయిలో ఈ సన్నివేశాలను మూవీ యూనిట్ షూటింగ్ చేస్తోంది. అత్యంత పరాక్రమశాలి భీం, ఉగ్రరూపుడైన రామరాజు తమ ఉమ్మడి లక్ష్యం కోసం పోరాడే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు మూవీ యూనిట్ వెల్లడించింది. ‘నా రామరాజు, నా భీమ్ కలిసికట్టుగా పోరాడుతున్నారు’ అంటూ రాజమౌళి ట్వీట్ చేయగా.. ఎంతో ఉద్విగ్నంగా ఉందని ఎన్టీఆర్.. బాగా కిర్రెక్కిపోయాం అంటూ రామ్‌చరణ్ ట్వీట్లు చేశారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానరుపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలియాభట్, ఒలివియో మోరిస్ కథానాయికలుగా నటిస్తున్న ఈ మూవీకి ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నాడు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ 2021 చివరిలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.