రక్తంలో గ్లూకోజ్ నిర్దిష్ట పరిమాణంలో ఉండాలి. ఒకవేళ గ్లూకోజ్ తక్కువగా ఉంటే దానిని హైపోగ్లైసీమియా అంటారు. లీటరు రక్తంలో 0.5 గ్రాముల కంటే గ్లూకోజ్ తక్కువగా ఉండటాన్ని హైపోగ్లైసీమియా లక్షణంగా వైద్యులు నిర్ధారిస్తారు. ఈ లక్షణం తీవ్రంగా ఉంటే మనిషి స్పృహ కోల్పోవడంతో పాటు గుండెముప్పుకు గురవుతాడు. తీవ్రంగా జిమ్ చేయడం, ఉపవాసం చేయడం, కిడ్నీ వైఫల్యం వంటివి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోవడానికి కారణమవుతాయి. ఈ ప్రక్రియ ప్రారంభం కాగానే శరీరం ముందుగా ఇతర పద్ధతుల్లో గ్లూకోజ్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో కొన్ని హార్మోన్లు విడుదల కావడంతో శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. హైపోగ్లైసీమియాను నివారించడానికి అల్పాహారం ఎక్కువగా తీసుకోవాలి. అల్పాహారంలో తీపి పదార్థాలు ఉండేలా చూడాలి. రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉంటే మూర్చ వచ్చే ప్రమాదం ఉంది. కావున గ్లూకోజ్ ఇంజెక్షన్ ఎప్పుడూ వెంట పెట్టుకోవాలి. తరచూ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని పరీక్షించుకుంటూ ఉండాలి. ఎక్కువ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.