Breaking News

శంకర్ దర్శకత్వంలో పవన్-చరణ్ మల్టీస్టారర్

0 0

మెగా కుటుంబంలో ఉండటానికి 10 మందికి పైగా హీరోలున్నా నిఖార్సైన మల్టీస్టారర్ ఇప్పటివరకు రాలేదు. చిరుత, ఖైదీ నంబర్ 150, ఆచార్య సినిమాల్లో కేవలం అతిథి పాత్రలతో చిరు, చరణ్ తళుక్కుమనిపించారు. కానీ అభిమానులు ఫుల్ లెంగ్త్ మల్టీస్టారర్‌ను కోరుకుంటున్నారు. ఆ కొరతను తీర్చే బాధ్యత బాబాయ్-అబ్బాయ్ తీసుకున్నట్లే కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకే సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లలో కనిపించబోతున్నారంటూ ఫిలింనగర్‌లో టాక్ వినపడుతోంది. ఈ సినిమాకు భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఇండియన్ 2 తర్వాత శంకర్ చేయబోయే సినిమా ఇదేనట. ఓ బడా నిర్మాణ సంస్థ ఈ మూవీని నిర్మించబోతుందని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్‌తో పాటు సాగర్ చంద్ర, హరీష్ శంకర్, క్రిష్, సురేందర్ రెడ్డితో సినిమాలు చేస్తుండగా రామ్ చరణ్ కూడా ఆర్.ఆర్.ఆర్, ఆచార్య సినిమాలతో బిజీగా ఉన్నాడు.