Breaking News

‘లైగర్’గా వస్తున్న విజయ్ దేవరకొండ

0 0

టాలీవుడ్ యువహీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీకి టైటిల్ ఖరారైంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘లైగర్’ అనే టైటిల్‌ను మూవీ యూనిట్ ఖరారు చేసింది. దీనికి ట్యాగ్‌లైన్‌గా సాలా క్రాస్ బ్రీడ్ అని పెట్టారు. సింహానికి, పులికి పుడితే ఆ జాతిని లైగర్ అని అంటారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి డాన్ పాత్రలో విజయ్ దేవరకొండ తండ్రిగా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. కరణ్ జోహార్, పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తొలుత ఈ సినిమాకు ఫైటర్ అని పెడతారని టాక్ వినపడగా.. ఆ టైటిల్‌తో బాలీవుడ్‌లో మరో మూవీ నిర్మితమవుతోంది. దీంతో పూరీ టీమ్ ‘లైగర్’కు మొగ్గు చూపింది. విజయ్ దేవరకొండ బాక్సర్‌గా కనిపించనున్న ఈ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నాడు.